![]() |
![]() |

బుల్లితెర మీద సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. షోస్, ఈవెంట్స్ కంటే ముందు ప్రోమోస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక జీ తెలుగులో "సంక్రాంతి అల్లుడు పండగకి వస్తున్నారు" షోకి సంబందించిన మరో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కావ్య, భూమిక, ఆనాల సుష్మిత వీళ్ళు ప్రదీప్ కి, సుధీర్ కి లవ్ లెటర్స్ రాసి ఇంప్రెస్ చేశారు. ఎవరెవరు ఎం రాసారంటే "ఓం సుధీర్ బావాయనమః నీ అందం పాలపుంత, నీ స్పర్శ తాకితే పులకింత" అంటూ ప్రదీప్ సుధీర్ కి సుష్మిత రాసిన లేఖ చదువుతూనే ఆమెను కొరికేసేలా చూస్తూ ఉన్నాడు. ఇక సుధీర్ ప్రదీప్ చూపులకు బ్రేక్ వేసాడు. "గాలి ఓ గాలి నింగి ఓ నింగి సుధీర్ కి నేను అర్ధాంగి" అంటూ కావ్య సుధీర్ కి రాసిన లెటర్ ని ప్రదీప్ చదివి వినిపించాడు.
తర్వాత సుధీర్ - కావ్య కలిసి సాంగ్ కి డాన్స్ చేశారు. తర్వాత ప్రదీప్ కి భూమి రాసిన లవ్ లెటర్ ని సుధీర్ చదివి వినిపించాడు. "డియర్ ప్రదీప్.. ఈ లోకంలో మగాళ్ళెంతమందున్నా నా మనసు మాత్రం నిన్నే మొగుడు అని పిలవమంటోంది..ఈ ప్రాణం నీ సొంతం. ఇట్లు నీ భూమిక మాచిరాజు" అని చదివేలోపు భూమిక మోకాళ్ళ మీద కూర్చుని ప్రదీప్ కి ప్రొపోజ్ చేసేసింది.
![]() |
![]() |